‘ఆర్టికల్‌ 15’ ఏం చెప్తోంది??

ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా ‘ముల్క్‌’ ఫేం అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్టికల్‌ 15’. 2014 నాటి బదాయూ సామూహిక అత్యాచార ఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. రోజూకూలీ చేస్తున్న ముగ్గురు ఆడపిల్లలు.. తమ దినసరి కూలీని మూడు రూపాయలు పెంచమన్నందకు వాళ్లలో ఇద్దర్ని అత్యాచారం చేసి చంపేస్తారు. శవాల్ని చెట్టుకు వేలాడదీస్తారు. మిగిలిన అమ్మాయి కోసం వెతికే పోలీస్‌ ఆఫీసర్‌గా ఆయుష్మాన్ నటించాడు. ట్రైలర్‌లో చూపించిన కొన్ని సన్నివేశాలు మనసుల్ని మెలిపెట్టేవిగా ఉన్నాయి. కులాల అడ్డుగోడలు తొలగించాలనేది ‘ఆర్టికల్‌ 15’ ఉద్దేశం. ఇప్పుడిదే అంశాన్ని అందరికీ అర్థమయ్యేలా సరికొత్తగా చూపించబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం.. జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.