జీనీగా విల్‌ స్మిత్‌

అల్లాద్దీన్‌ అద్భుత దీపం కథ అంటే పిల్లలకు భలే మక్కువ. దీపం నుంచి బయటికొచ్చే జీనీ అనే విచిత్రమైన వ్యక్తి అల్లాద్దీన్‌ కోరిన కోరికలను తీరుస్తుంటాడు. అందుకోసం అతడు చేసే మాయలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంటాయి. ఈ కథతో 1992లో హాలీవుడ్‌లో ‘అల్లాద్దీన్‌’ అనే యానిమేషన్‌ చిత్రం వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆ చిత్రానికి లైవ్‌ యాక్షన్‌ రూపంగా అదే పేరుతో డిస్నీ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించింది. మ్యూజికల్‌ రొమాంటిక్‌ పాంటసీ అడ్వెంచర్‌ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో జీనీ పాత్రలో ప్రముఖ నటుడు విల్‌ స్మిత్‌ నటించారు. ప్రముఖ దర్శకుడు గై రిజి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను గ్రామీ అవార్డ్స్‌ వేడుకలో విడుదల చేశారు. ఒళ్లంతా నీలి రంగుతో, పిలక జుత్తు, పిల్లి గడ్డంతో, మెడలో హారం, చేతులకు కవచాలతో జీనీగా విచిత్రమైన లుక్‌లో కనిపిస్తున్నారు స్మిత్‌. మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.