పిల్లల్ని భయపెడుతున్న ‘కమ్‌ ప్లే’

జాకబ్‌ చేజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హాలీవుడ్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘కమ్‌ ప్లే’. జాబ్‌‌ చేజ్‌ రచించని లారీ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గిలియన్ జాకబ్స్,  రాబర్ట్ సన్‌, జాన్‌ గల్లాఘర్‌ జూనియర్‌ తదితరులు నటించారు. అంబ్లిన్‌ పార్టనర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, ది పిక్చర్స్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి అండ్ర్యూ రోన, అలెక్స్ హీన్మాన్ నిర్మాతలు. చిత్ర కథేంటంటే మానసిక బలహీనమైన ఓ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని లారీ అనే పెద్ద అవయవాలు కలిగిన రాక్షసుడు అనుసరిస్తుంటాడు. లారీ (అవయవ రాక్షసుడు) ఒలివర్ (అజీ రాబర్ట్‌సన్) అనే బాలుడి కుటుంబంతో పాటు తన క్లాస్‌మేట్స్ వారి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీ స్ర్కీన్లతో పాటు ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా కనిపిస్తూ ఉంటాడు. లారీ ఉద్దేశ్యం పిల్లల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని తనతో స్నేహంగా ఉండాలని అభ్యర్థిస్తూ ఆకర్షిస్తుంది. అసలు దాని ఉద్దేశ్యం ఏమిటంటే వాస్తవ ప్రపంచంలో ప్రవేశించకుండా ఎప్పుడూ తనతోనే ఉండాలనే చెడు ఆలోచన చేస్తుంది. అయితే ఒలివర్ తల్లితండ్రులు (గిలియన్ జాకబ్స్, జాన్ గల్లాఘర్ జూనియర్) ఆ హ్యూమనాయిడ్‌ జీవి పిల్లాడి అపహరించకుండా ఏం చేశారనేది మిగిలిన కథ. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ భయపెడుతూ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది జులై 24న తెరపైకి రావాల్సిన చిత్రం, కోరనా వైరస్‌ (కోవిడ్‌ 19)వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమాని అక్టోబర్‌ 30, 2020న విడుదల చేస్తున్నారు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.