భయపెడుతున్న రాబర్ట్ ప్యాటిన్సన్‌ ‘బ్యాట్‌మ్యాన్‌’ ట్రైలర్‌

పేరొందిన డీసీ కామిక్స్ బుక్స్ ఆధారంగా సూపర్‌హీరోగా వస్తున్న చిత్రం ‘బ్యాట్‌మ్యాన్’‌‌. రాబర్ట్ ప్యాటిన్సన్ ఇప్పుడు ‘బ్యాట్‌మెన్’‌ హీరోగా అలరించనున్నారు. మ్యాట్ రీవ్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ విడుదలై భయపెడుతోంది. గతంలో బ్యాట్‌మ్యాన్‌ సీరీస్‌ చిత్రాల్లో నటించిన బెన్‌ అప్లెక్‌ తప్పుకున్నారు. దాంతో ఈ పాత్రలో రాబర్ట్ ప్యాటిన్సన్‌ నటిస్తున్నారు. డీసీ ఫిల్మ్స, 16 అండ్‌ ఇదాహో ప్రొడక్షన్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇంకా ఇందులో క్యాట్‌ఉమన్‌గా జోవ్ క్రావిట్జ్ నటిస్తోంది. ఎడ్వర్డ్ నాష్టన్‌గా పాల్ డానో నటిస్తున్నారు. వార్నర్‌ బ్రదర్స్ పంపిణీదారుగా వ్యవహరిస్తున్న సినిమాకి మైఖేల్ గియాచినో సంగీత స్వరాలు సమకూరుస్తుండగా, గ్రెగ్ ఫ్రేజర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిన్నారు. చిత్రంలో ఇంకా జెఫ్రీ రైట్, జాన్ టర్టురో, పీటర్ సర్స్‌గార్డ్, బారీ కియోఘన్, జేమే లాసన్, ఆండీ సెర్కిస్, కోలిన్ ఫారెల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఎంపిక చేసిన 3డి మరియు 2డి తెరలతో పాటు ఐమాక్స్ థియేటర్లలో చిత్రాన్ని అక్టోబర్ 1, 2021న విడుదల చేయనున్నారు. రాబర్ట్​ ప్యాటిన్సన్ 'టెనెట్', 'ద లైట్ హౌస్'​, 'వెయిటింగ్ ఫర్ ద బార్బేరియన్స్ చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో కనపించనున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.