నవంబర్‌లో ఇండియాకు వస్తోన్న హర్రర్‌ చిత్రం కమ్‌ ప్లే

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు జాకబ్‌ చేజ్‌ దర్శకత్వం వహిస్తున్న భయానక చిత్రం కమ్‌ ప్లే. ఒంటరితనం - సాంకేతిక టెక్నాలజీతో కలిసి ఆధునిక సమస్యలు ఎలాంటి పిల్లలో ఎలాంటి పాత్ర పోషిస్తాయో మా సినిమాలో చూపిస్తున్నాం అంటున్నారు దర్శకుడు జాకబ్‌. ఈ సినిమాదలో టెక్నాలజీ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిచోటా సాంకేతిక మనచుట్టూరా ఉంది. హర్రర్‌ సినిమల్లో సాంకేతికను ఉపయోగించాం. సినిమా అంతా సాంకేతికతతో పాటు ఒంటరితనం మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తున్నాం. సాంకేతికత అనేది చాలా అద్భుతమైనది. అయినా మనం దాన్ని ఉపయోగించే తీరుతెన్నులే ఒంటరితనానికి దారితీస్తుందని చెబుతున్నారు. జాబ్‌‌ చేజ్‌ రచించని లారీ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గిలియన్ జాకబ్స్, రాబర్ట్ సన్‌, జాన్‌ గల్లాఘర్‌ జూనియర్‌ తదితరులు నటించారు. అంబ్లిన్‌ పార్టనర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, ది పిక్చర్స్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి అండ్ర్యూ రోన, అలెక్స్ హీన్మాన్ నిర్మాతలు. చిత్ర కథేంటంటే మానసిక బలహీనమైన ఓ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని లారీ అనే పెద్ద అవయవాలు కలిగిన రాక్షసుడు అనుసరిస్తుంటాడు. లారీ (అవయవ రాక్షసుడు) ఒలివర్ (అజీ రాబర్ట్‌సన్) అనే బాలుడి కుటుంబంతో పాటు తన క్లాస్‌మేట్స్ వారి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీ స్ర్కీన్లతో పాటు ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా కనిపిస్తూ ఉంటాడు. లారీ ఉద్దేశ్యం పిల్లల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని తనతో స్నేహంగా ఉండాలని అభ్యర్థిస్తూ ఆకర్షిస్తుంది. అసలు దాని ఉద్దేశ్యం ఏమిటంటే వాస్తవ ప్రపంచంలో ప్రవేశించకుండా ఎప్పుడూ తనతోనే ఉండాలనే చెడు ఆలోచన చేస్తుంది. అయితే ఒలివర్ తల్లితండ్రులు (గిలియన్ జాకబ్స్, జాన్ గల్లాఘర్ జూనియర్) ఆ హ్యూమనాయిడ్‌ జీవి పిల్లాడి అపహరించకుండా ఏం చేశారనేది మిగిలిన కథ.ఈ చిత్రం భారతదేశంలో నవంబర్‌ 27న థియేటర్లోకి రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.