డ్రాగన్‌ దాడులు ఇంకోసారి

తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్‌ యానిమేషన్‌ చిత్రం ‘హౌ టు ట్రైన్‌ యువర్‌ డ్రాగన్‌’ మంచి విజయం సాధించింది. తమ ఊరిపై దాడి చేస్తున్న డ్రాగన్లను ఎదర్కోవడానికి పదిహనేళ్ల కుర్రాడు చేసే సాహసాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. దానికి సీక్వెల్‌గా 2014లో వచ్చిన ‘హౌ టు ట్రైన్‌ యువర్‌ డ్రాగన్‌ 2’ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కించుకుంది. ఈ సిరీస్‌లో మూడో చిత్రంగా ‘హౌ టు ట్రైన్‌ యువర్‌ డ్రాగన్‌: ది హిడెన్‌ వరల్డ్‌’ రూపొందింది. గత రెండు చిత్రాలను తెరకెక్కించిన డీన్‌ డెబ్లొయిస్‌ కొత్త చిత్రానికీ దర్శకుడిగా వ్యవహరించారు. డ్రీమ్‌ వర్క్స్‌ యానిమేషన్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనూ విడుదల కాబోతోంది. మార్చి 22న ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో టూడీ, త్రీడీ, ఐమ్యాక్స్‌ వెర్షన్లలో ప్రేక్షకులను అలరించడానికి రాబోతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో విడుదలైన ఈ చిత్రం అమెరికాలో ఈ నెల 22న థియేటర్లలోకి రాబోతోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.