జుమాంజి: ద నెక్ట్స్‌ లెవెల్‌’ తెలుగు ట్రైలర్‌ చూశారా..

‘జుమాంజి’ సిరీస్‌కు హాలీవుడ్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగానూ విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇప్పుడీ సిరీస్‌ నుంచి మూడో భాగంగా ‘జుమాంజి: ది నెక్ట్స్‌ లెవెల్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇందులో డ్వేన్‌ జాన్సన్‌ (రాక్‌) కథానాయకుడిగా నటించగా.. జేక్‌ బ్లాక్, కెవిన్‌ హర్ట్, నిక్‌ జోనాస్, కరెన్‌ గిల్లాన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. చిత్రంలోని ప్రధాన పాత్రధారులంతా జుమాంజికి సంబంధించిన ఓ హార్డ్‌ డిస్క్‌ను ముట్టుకోగానే అకస్మాత్తుగా ఆ విచిత్ర ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఇక అక్కడి నుంచి వారు చేసే సాహసాలు ఏంటి? వారు ఆ లోకం నుంచి తిరిగి బయటకొచ్చారా? లేదా అన్న నేపథ్యంతో చిత్రం సాగబోతుంది. ట్రైలర్‌లో కనిపించిన యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. డ్వేన్‌.. తన బృందం మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం డిసెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.