సింహంగా మారుతోన్న నాని

ప్రఖ్యాత డిస్నీ సంస్థ నుంచి వస్తున్న చిత్రం ‘లయన్‌ కింగ్‌’. త్రీడీ యానిమేటెడ్‌ సాంకేతికతతో, కామిక్‌ అభిమానులకి సరికొత్త అనుభూతిని పంచేలా జాన్‌ ఫేవరోవ్‌ తెరకెక్కించారు. అడవి నేపథ్యంలో సాగే ఈ కథలో జంతువులు మాట్లాడుతుంటాయి. సింబ అనే సింహం, టిమోన్‌ అనే ముంగిస, పుంబా అనే అడవి పంది కీలక పాత్రలుగా కనిపిస్తాయి. సింబ అనే సింహమే అడవికి రాజు, ఈ చిత్రానికి కథానాయకుడు. ఆ పాత్రకి యువ కథానాయకుడు నాని గళాన్నిచ్చారు. సింబా తండ్రి పాత్ర అయిన ముఫాసాకి రవిశంకర్, ప్రతినాయక పాత్ర అయిన స్కార్‌కి జగపతిబాబు, పుంబా పాత్రకి బ్రహ్మానందం, టిమోన్‌ పాత్రకి అలీ గళాల్ని ఇచ్చారు. ‘ఈ యేడాది నన్ను తండ్రిగా చూశారు (జెర్సీ చిత్రంలో). త్వరలో కొడుకుగా చూస్తారు. ఈ జులైలో నా కొత్త పేరు సింబా...’ అని ట్వీట్‌ చేశారు నాని. జులై 19న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.