కొత్త స్పైడర్‌ మ్యాన్‌ వచ్చేశాడు..

మా
ర్వెల్‌ కామిక్స్‌ నుంచి విడుదలైన స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్‌ కామిక్స్‌ సినిమాల క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ సిరీస్‌ నుంచి ‘స్పైడర్‌ మ్యాన్‌ ఫార్‌ ఫ్రం హోమ్‌’ చిత్రం వస్తోంది.  తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసిరిస్‌ అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌తో ముడిపడి ఉంది. ప్రతినాయకుడు థానోస్‌ను అంతం చేయడానికి ఐరన్‌ మ్యాన్‌తో పాటు స్పైడర్‌ మ్యాన్‌ కూడా సిద్థం అవుతున్నాడు. థానోస్‌ అంతం తరువాత స్పైడర్‌ మ్యాన్‌ స్నేహితులతో కలిసి యూరప్‌ విహార యాత్రకు వెళతాడు. అక్కడ ఎదురయ్యే పరిణామాలు చిత్రీకరించారు.ఈ సీరిస్‌కు ముందు విడుదలైన ‘స్పైడర్‌ మ్యాన్‌: హోం కమింగ్‌’ సినిమాలో ఐరన్‌ మ్యాన్‌తో కలిసి స్పైడర్‌ మ్యాన్‌ సాహసాలు చేస్తాడు. అంతేకాదు, స్పైడర్‌ మ్యాన్‌కు ఐరన్‌మ్యాన్‌ సరికొత్త సూట్‌ కూడా ఇస్తాడు. తాజా ట్రైలర్‌లో ఐరన్‌ మ్యాన్‌ కనిపించకపోవడం, స్పైడర్‌ మ్యాన్‌ సూట్‌లోనూ మార్పులేవీ కనిపించకపోవడంతో ‘ఐరన్‌ మ్యాన్‌’ ఉన్నాడా? చనిపోయాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాహసోపేతమైన సన్నివేశాలు ఈ ట్రైలర్‌లో అంతగాలేవు. ఈ చిత్రంలో టామ్‌ హాలాండ్, శామ్యూల్‌ జాక్సన్, జెండయా, స్లమ్‌డర్స్, జాన్‌ ఫెవరివ్, స్మూమీ, జాకబ్‌ బాట్లన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోనీ పిక్చర్స్‌ విడుదల చేస్తున్న ఈ చిత్రాన్ని కెవిన్‌ ఫిగ్, అమీ పాస్కల్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.