దడపుట్టిస్తున్న ‘టెనెట్‌’ ఫైనల్‌ ట్రైలర్‌

జాన్ డేవిడ్ వాషింగ్టన్‌ కథానాయకుడిగా హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘టెనెట్‌’. మూడవ ప్రపంచ యుద్దాన్ని నివారించే ఒక రహస్య ఏజెంట్‌ నేపథ్యంగా యాక్షన్‌ థ్రిల్లర్‌గా చిత్రం తెరకెక్కింది. ఏడు దేశాలలో చిత్రకరించిన ఈ సినిమాలో రాబర్ట్ ప్యాటిన్సన్, ఎలిజబెత్ డెబికి, డింపుల్ కపాడియా, ఆరోన్ టేలర్-జాన్సన్, క్లెమెన్స్ పోసీ, మైఖేల్ కెయిన్, కెన్నెత్ బ్రానాగ్‌లు కలిసి సందడి చేస్తున్నారు. ఇప్పటికే సినిమా జులై 1న విడుదల కానుందని ప్రకటించారు చిత్రబృందం. ఆ తరువాత జులై 31కి వాయిదా వేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు వార్నర్‌ బ్రదర్స్ సంస్థ ప్రకటిచింది. ఈ సినిమా ఫైనల్ ట్రైలర్‌ ఈరోజు విడుదలైంది. ప్రస్తుతం సినిమా ఆగస్టు 26న యుకేలో తరువాత సెప్టెంబర్‌ సెప్టెంబర్‌ 3న యుఎస్‌లో విడుదల కానుంది. 220 నుంచి 225 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌ని కొంతభాగం ముంబైలోని గేట్‌ ఆఫ్‌ ఇండియా, తాజ్‌ మహల్‌ హోటల్‌ను చిత్రీకరించారు. సింకోపీ ప్రొడక్షన్, వార్నర్‌ బ్రదర్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ డైరెక్టర్ హొయెట్ వాన్ హోయిటెమా చేస్తుండగా, లుడ్విగ్ గెరాన్సన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో భారత సంతతికి చెందిన హిమేష్‌ పటేల్‌తో పాటు బాలీవుడ్ నటి డింపుల్‌ కపాడియా కూడా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తోపాటు ప్రస్తుతం విడుదలైన ఫైనల్‌ ట్రైలర్‌ కూడా చిత్రంపై భారీ అంచానాలను పెంచేసింది. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా ‘టినెట్‌’ చిత్రాన్ని థియేటర్లలో మరియు ఐమాక్స్ లో పంపిణీ చేస్తోంది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.