వెయ్యి సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లుంది!!

ప్రపంచ సినీప్రియులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్‌: ది ఎండ్‌ గేమ్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది నిర్మాణ సంస్థ మార్వెల్‌. ఇందులో భాగంగా తాజాగా మరో కొత్త ట్రైలర్‌ను బయటకొదిలింది. ‘‘ఇది చూస్తుంటే వెయ్యి సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లుంది’’ అని ఐరన్‌మ్యాన్‌ చెబుతున్న సంభాషణలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా మొదలైంది. ఈ సిరీస్‌కు ముందొచ్చిన ‘ఇన్ఫినిటీ వార్‌’ ముగింపులో కొంతమంది అవెంజర్స్‌ మాయమవుతూ కనిపించారు. ఇలా మాయమైన వారంతా ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారు? ప్రపంచాన్ని నాశనం చేసి, తన సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలనుకున్న థానోస్‌ ఏం చేయబోతున్నాడు? ఈ విపత్కర పరిణామాలను అవెంజర్స్‌ ఎలా అడ్డుకోనున్నారు? తదితర అంశాల్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ప్రముఖ దర్శకులు ఆంటోని రుస్సో, జాయ్‌ రుస్సో సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోన్న ఈ చిత్రం.. వేసవి కానుకగా ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.