ఆగస్టు 26న టెనెట్‌ విడుదల

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన చిత్రం టెనెట్. ప్రపంచ వ్యాప్తంగా సినిమా 70 దేశాలలో ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇండియా విడదల తేదీ ఇంకా నిర్ణయించబడలేదు. ఇక సెప్టెంబర్ 3న యుఎస్‌ఏలోని ఎంపిక నగరాల్లో విడుదల చేయనున్నారు. చైనాలో టెనెట్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సరైన నిర్ణయాన్ని ప్రకటించలేదు. మొత్తం ఈ సినిమా వార్నర్ బ్రదర్స్ స్టూడియో ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కొరియా, రష్యా మరియు యుకెతో సహా 70 దేశాల్లో ప్రేక్షకుల ముందుకొస్తుంది. తొలుత ఈ చిత్రం జూలై 17న తెరపైకి రావాల్సి ఉంది, ఆ తరువాత జూలై 31కి, తరువాత, ఆగస్టు 12న కరోనావైరస్ మహమ్మారి కారణంగా 26కి వాయిదా పడింది.


క్రిస్టోఫర్‌ నోలన్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘టెనెట్‌’. మూడవ ప్రపంచ యుద్దాన్ని నివారించే ఒక రహస్య ఏజెంట్‌ నేపథ్యంగా యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో జాన్‌ డేవిడ్‌ వాషింగ్టన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఏడు దేశాలలో చిత్రకరించిన ఈ సినిమాలో రాబర్ట్ ప్యాటిన్సన్, ఎలిజబెత్ డెబికి, డింపుల్ కపాడియా, ఆరోన్ టేలర్-జాన్సన్, క్లెమెన్స్ పోసీ, మైఖేల్ కెయిన్, కెన్నెత్ బ్రానాగ్‌లు కలిసి సందడి చేస్తున్నారు. గతంలో చిత్రనిర్మాణ సంస్థ..‘‘పరిస్థితులో సంప్రదాయంగా విడుదలయ్యే చిత్రాలతో పోల్చలేం. ప్రేక్షకులు పూర్తి నమ్మకంతో థియేటర్లోకి వచ్చినప్పుడే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని చెబుతోంది. ఈ చిత్రం ముంబైలోని గేట్‌ ఆఫ్‌ ఇండియా, తాజ్‌ మహల్‌ హోటల్‌ను చిత్రీకరించారు. సింకోపీ ప్రొడక్షన్, వార్నర్‌ బ్రదర్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ డైరెక్టర్ హొయెట్ వాన్ హోయిటెమా చేస్తుండగా, లుడ్విగ్ గెరాన్సన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో భారత సంతతికి చెందిన హిమేష్‌ పటేల్‌తో పాటు బాలీవుడ్ నటి డింపుల్‌ కపాడియా కూడా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తోపాటు ప్రస్తుతం విడుదలైన ట్రైలర్‌ కూడా అలరించేలా ఉంది. వార్నర్‌ బ్రదర్స్ పంపిణీ దారుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.