మరో అభినేత్రి ఆగమనం


ప్ర‌భుదేవా, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన `అభినేత్రి` తెలుగులో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా, మరోసారి వారిద్దరూ జోడీగా నటిస్తోన్న చిత్రం `అభినేత్రి 2’. నందితా శ్వేత, స‌ప్త‌గిరి, సోనూసూద్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. విజ‌య్ ద‌ర్శ‌కుడు. అభిషేక్ నామా, ఆర్‌. ర‌వీంద్ర‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 31న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మాట్లాడుతూ ``అభినేత్రి` సినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు సీక్వెల్‌గా వ‌స్తున్న `అభినేత్రి 2`ను తీసుకొస్తున్నాం. ఇది కూడా ప్ర‌తి ఒక్క‌రినీ అల‌రిస్తుంది. థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే, మ‌న‌సుకు న‌చ్చే ఆహ్లాద‌క‌రమైన స‌న్నివేశాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి చక్కటి స్పందన వ‌చ్చింది. ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, నందితా శ్వేతాల నటన సినిమాకే హైలైట్ అవుతాయి. శామ్ సంగీతం అంద‌రినీ త‌ప్ప‌క అల‌రిస్తుంది. ఆయంక బోస్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ప్ల‌స్ అవుతుంది. మే 31న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం`` అని చెప్పారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.