క్లాస్‌గా ఉండే బన్నీ మాస్‌గా ఎలా మారాడో?

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడుగా చేస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. దసరా కానుకగా ఈ చిత్రంలోని బన్నీ లుక్‌ను అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో బన్నీ కొందర్ని కొడుతూ కనిపించాడు. ఓ పోరాట సన్నివేశంలోని ఈ మాస్‌ లుక్‌ అందర్ని ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్ర టీజర్‌లో బన్నీ చాలా కూల్‌గా క్లాస్‌ లుక్‌లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఇలా ఎందుకు మారాడు అనే ఆసక్తి పెంచుతోంది ఈ పోస్టర్‌. ఎలా మారాడో, ఎందుకు మారాడో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.

                       


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.