‘వైకుంఠపురము’లో జానపదం

పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో జానపద గీతాలు బాగా వినిపించేవి. ‘తాటిచెట్టెక్కలేవు... తాటికల్లు తెంపలేవు’, ‘బై బైయ్యే బంగారు రవణమ్మ’ లాంటి పాటలు థియేటర్లో ఊపేసేవి. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోనూ అలాంటి ఓ జానపద గీతాన్ని వినిపించనున్నారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. పూజా హెగ్డే నాయిక. త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఓ ప్రసిద్ధమైన శ్రీకాకుళ జానపద గీతాన్ని వాడుకుంటున్నారట. ఆ పాటని తమన్‌ స్వరపరిచారని, ఓ ప్రత్యేకమైన సందర్భంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు గీతాలు విడుదలయ్యాయి. ‘సామజవరగమన’, ‘రాములో.. రాములా’ రెండూ శ్రోతల్ని అలరించాయి. త్వరలోనే మరో గీతాన్ని విడుదల చేయడానికి సమాయత్తం అవుతోంది చిత్రబృందం. అయితే జానపద గీతాన్ని థియేటర్‌లోనే చూపిస్తారట. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.