సంక్రాంతి బరిలో బన్నీ


సంక్రాంతి సీజన్‌ టాలీవుడ్‌కి చాలా కీలకం. ఎన్ని చిత్రాలొచ్చినా వసూళ్ల వర్షం కురిపించడం ఈ పండగ ప్రత్యేకత. అందుకే పెద్ద సినిమాలన్నీ వరుస కడుతుంటాయి. 2020 ముగ్గుల పండక్కి స్టార్లు సందడి చేయబోతున్నారు. ఆ జాబితాలో అల్లు అర్జున్‌ కూడా చేరారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘అలకనంద’, ‘నాన్న..నేను’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.