రంభ..ఊర్వశి..మేనకను కలిపిస్తే నేనే అంటోన్న మోనాల్‌

బిగ్‌బాస్‌ ఫేమ్‌ మోనాల్‌ గజ్జర్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తున్న అల్లుడు అదుర్స్ చిత్రంలో చిందేస్తుంది. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. లిరికల్‌ వీడియోగా వచ్చిన ఆ గీతంలో రంభ..ఊర్వశి..మేనక.. అందరినీ కలిపిస్తే నేనిక అంటూ మోనాల్‌ తెగ హోయలు పోతుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా రేపు సంక్రాంతి రోజున ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ ఐటెమ్‌ గీతానికి హేమచంద్ర, మంగ్లీలు ఆలపించగా దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రంలో కథానాయికలుగా నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నటించగా, ఇతర పాత్రల్లో సోను సూద్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. నిర్మాత గొర్రెల సుబ్రహ్మణ్యం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.