ఆర్జీవీకి షాక్‌.. చిత్ర విడుదలకు హైకోర్డు బ్రేక్‌!

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో ప్రస్తుత రాజకీయాలపై ఓ వ్యంగ్యాస్త్ర చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. నూతన నటీనటులతో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్ర టైటిల్‌ కొన్ని కుల వర్గాల మధ్య అగ్గి రాజేసేలా ఉండటంతో సెన్సార్‌ సభ్యుల సూచన మేరకు పేరును మార్చారు. ఇప్పుడీ చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ తర్వాత వర్మ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం విడుదలకు అంతరాయం ఏర్పడింది.  సినిమా చూసి వారంలోగా అభ్యంతరాలుంటే తెలపాలని హైకోర్టు సెన్సార్‌ బోర్డును ఆదేశించింది.  అయితే ఇప్పటి వరకు ఎలాంటి సెన్సార్‌ పూర్తికాకపోవడంతో ఈ సినిమాకు వాయిదా పడే అవకాశాలున్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.