అక్టోబర్‌ 2నే నిశ్శబ్దంగా బయటకు వస్తోంది

బాహుబలి నటి అనుష్క శెట్టి నటిస్తోన్న బహుభాషా చిత్రం ‘నిశ్శబ్దం’. సైలెంట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫాంలపై దర్శనమివ్వబోతుందా? అని మొన్నటి వరకు అందరికి అనుమానాలు ఉండేవి. అందరూ అనుకుంటున్నట్లు డిజిటల్‌ వేదికగా చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అక్టోబర్‌ 2న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘మీ నిశ్శబ్దం.. మిమ్మల్ని రక్షిస్తుంది’’ అంటూ ట్యాగ్‌లైన్‌ జోడించారు. ఈ చిత్రంపై హక్కుల కోసం రూ.30కోట్ల మొత్తాన్ని వెచ్చించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అనుష్క - మాధవన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కించగా కోన వెంకట్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీస్‌ సంయుక్తంగా నిర్మించాయి. చిత్రంలో షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటించారు. గోపీ సుందర్‌ స్వరాలు సమకూరుస్తుండగా షనైల్‌ డియో సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ అక్టోబర్‌ 2, 2020న తెరపైకి రానుంది. ఆ మధ్య చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ కోసం చిత్రబృందం ప్రత్యేకంగా ఓ షో కూడా వెయ్యడం జరిగిందని సమాచారం వార్తలొచ్చాయి. సినిమా ప్రదర్శించి పూరి సలహాలు సూచనలు తీసుకున్నట్లు సమాచారం.

View this post on Instagram

A post shared by AnushkaShetty (@anushkashettyofficial) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.