కరోనా దెబ్బ: ‘అరణ్య’ వాయిదా

కరోనా దెబ్బకు ఇప్పటికే భారతీయ చిత్రసీమ మొత్తం కుదేలైపోయింది. చాలా రాష్ట్రాల్లో థియేటర్లు మూత పడగా.. అనేక సినిమాల చిత్రీకరణలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నేటి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోనూ చిత్రీకరణలు ఆపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇక తాజాగా రానా కథానాయకుడిగా నటిస్తోన్న బహు భాషా చిత్రం ‘అరణ్య’ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం హిందీలో ‘హాథీ మేరే సాథీ, తమిళ్‌లో ‘కాండన్‌’ పేర్లతో విడుదల కానుంది. నిజానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2నే థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. కానీ, కరోనా కారణంగా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోని సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని తెలియజేస్తామన్నారు. అడవి జంతువుల మనుగడ, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడే ఓ ఆదిమవాసి కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు ప్రభు సోలోమన్‌.






Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.