కరోనా ఎఫెక్ట్‌.. వెనకడుగేస్తున్న ‘అరణ్య’!!

రానా కథానాయకుడిగా నటించిన బహు భాషా చిత్రం తెలుగులో ‘అరణ్య’ పేరుతో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభు సాల్మోన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. హిందీలో ‘హాథీ మేరే సాథీ’, తమిళ్‌లో ‘కాండన్‌’ పేర్లతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. కానీ, ఇప్పుడీ తేదీ మారుతోన్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్మాతలు ఆలోచన చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఏప్రిల్‌ మూడో వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. అస్సాంలో జరిగిన ఓ వ్యక్తి నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆయన పేరు జాదవ్‌ ప్రియాంక్‌. పద్మశ్రీ అవార్డు అందుకొన్న ఆయన తన జీవిత కాలంలో దాదాపు 1300 ఏకరాల అడవిని నాటాడు. బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో ఆయన చేసిన ఈ పని వల్ల అక్కడి భూమి నది కోత నుంచి పరిరక్షించబడింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.