సంక్రాంతి కానుకగా ‘అరణ్య’

రానా కథానాయకుడిగా నటించిన బహు భాషా చిత్రం తెలుగులో ‘అరణ్య’ పేరుతో రాబోతున్న సంగతి తెలిసిందే. విష్ణు విశాల్‌ కీలక పాత్ర పోషించారు. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. హిందీలో ‘హాథీ మేరే సాథీ’, తమిళ్‌లో ‘కాండన్‌’ పేర్లతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేద్దామని చిత్ర బృందం భావించినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. తాజాగా మరో విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. 2021 సంక్రాంతి కానుకగా థియేటర్లలోనే విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు దర్శకనిర్మాతలు. ఆలస్యమైనా ప్రేక్షకులకు వినోదం థియేటర్‌లోనే పంచేందుకు ఎదురుచూస్తున్నారు. అస్సాంలో జరిగిన ఓ వ్యక్తి నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆయన పేరు జాదవ్‌ ప్రియాంక్‌. పద్మశ్రీ అవార్డు అందుకొన్న ఆయన తన జీవిత కాలంలో దాదాపు 1300 ఏకరాల అడవిని నాటాడు. బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో ఆయన చేసిన ఈ పని వల్ల అక్కడి భూమి నది కోత నుంచి పరిరక్షితమైంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.