ధనుష్‌ సినిమా మోహన్‌లాల్‌ చేతుల మీదగా...

ప్రముఖ నటుడు ధనుష్‌ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం ‘అసురన్‌’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రాన్ని తమిళనాడుతో పాటు కేరళలో కూడా విడుదలచేయబోతున్నారు. తమిళ్‌లో కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు ‘అసురన్‌’ కేరళ విడుదల హకులను ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ సొంతం చేసుకోవడం విశేషం. తన మ్యాక్స్‌ల్యాబ్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ధనుష్‌కు కేరళలో కూడా సినీ అభిమానులున్నారు. ఆయన చిత్రాలకు మంచి కలెక్షన్లు కూడా వస్తాయి. దీంతో ‘అసురన్‌ను’ ఎక్కవ థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల సెన్నార్‌ జరుపుకున్న ఈ చిత్రం ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ పొందింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.