రాక్షసుల రూపం మాత్రమే మారింది

పురాణాల్లోనే కాదు, ఆధునిక యుగంలోనూ రాక్షసులు ఉన్నారు. కాకపోతే రూపమే మారింది. రాక్షసుల్ని సంహరించడానికి దేవుడు ఇప్పటికీ అవతారాలు ఎత్తుతూనే ఉన్నాడు. ప్రతి యుగంలోనూ ఒక్కో రూపంలో రాక్షస సంహారం జరుగుతుంది. మరి మా చిత్రంలో ఎలా జరిగిందో? ఆ రాక్షసుడు ఎవరో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. రమేష్‌ వర్మ దర్శకుడు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టు 2న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘రాచ్చసన్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగుతుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సోదరుడు, ప్రముఖ గాయకుడు సాగర్‌ ఈ చిత్రంతో సంభాషణల రచయితగా పరిచయం అవుతున్నారు. నేపథ్య సంగీతం, పోరాట ఘట్టాలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయ’’న్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.