‘బిచ్చగాడు’ దర్శకుడి మరో సరికొత్త ప్రయోగం..

‘బిచ్చగాడు’ వంటి వైవిధ్యభరిత చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దర్శకుడు శశి. తాజాగా ఈ యువ దర్శకుడు ‘శివప్పు మంజల్‌ పచ్చై’ అనే మరో ప్రయోగాత్మక కథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. సిద్ధార్థ్‌, జీవీ ప్రకాశ్‌ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం తెలుగులో ‘ఎరుపు పసుపుపచ్చ’ పేరుతో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్రను పోషిస్తుండగా.. ప్రకాశ్‌ ఓ బైక్‌ రేసర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే తమిళ ట్రైలర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. త్వరలోనే తెలుగు ట్రైలర్‌ను రిలీజ్‌ చేయడానికి సన్నాహలు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం సెప్టెంబరులో తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్‌ ఫిలింస్‌ పతాకంపై రమేష్‌ పిళ్లై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.