‘కలర్‌ ఫొటో’.. ప్రింట్‌ ఆరోజే


సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటిస్తోన్న చిత్రం ‘కలర్‌ ఫొటో’. సందీప్‌ రాజ్‌ దర్శకుడు. రాజేష్‌ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరులో ‘ఆహా’ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘కలర్‌ ఫొటో’తో వినోదాన్ని మీ ఇంటికొచ్చి అందివ్వబోతున్నాం. మీ మొబైల్స్, టీవీ, లాప్‌టాప్‌లు మా కోసం ఆన్‌ చేయండి చాలు. మా చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబరు 23న ఆహా ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నామ’’న్నారు. ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు యూట్యూబ్‌లో మంచి ఆదరణ దక్కుతోంది. సినిమా కూడా ఇంతే చక్కటి ఫలితాన్ని అందుకుంటుందని నమ్మకంతో ఉన్నామ’’న్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ, కూర్పు: కోదాటి పవన్‌ కల్యాణ్, కళ: క్రాంతి ప్రియం, ఛాయాగ్రహణం: వెంకట్‌ ఆర్‌ శాఖమురి.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.