వర్మ ‘లక్ష్మీస్‌’కు.. ఈసీ మరో ఝలక్‌

న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మే 1న ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తామని దర్శకుడు రామ్‌గోపాల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, వర్మ ఆశలకు ఎన్నికల సంఘం బ్రేక్‌ వేసి మరోసారి షాక్‌ ఇచ్చింది. తాము ‘లక్ష్మీస్‌..’ విడుదల చేయడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వడం కానీ, ఆంక్షలు సడలించడం కానీ చేయలేదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఈ చిత్ర విడుదల అంశంపై ఈసీకి ఆర్జీవీ లేఖ రాయగా.. తాజాగా దానిపై తన స్పందనను తెలియజేసింది. దేశవ్యాప్తంగా బయోపిక్‌లపై నిషేధం విధిస్తూ ఏప్రిల్‌ 10న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వులకు కచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందేనని ద్వివేది తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎలాంటి ఈసీ ఎలాంటి సడలింపులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఏపీలో ఎక్కడా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను విడుదల కానీయకుండా చూడాలని కలెక్టర్లని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రస్తుతం ఈసీ ఇచ్చిన ఆదేశాలను బట్టీ చూస్తే ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు సినిమా బయటకు రావడం కుదరదనే తెలుస్తోంది. మరి దీనిపై వర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.