ఈఫిల్‌ టవర్‌ను తాకిన ‘సామజవరగమన’..

ల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `అల.. వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పాట సంచ‌ల‌నాల్ని సృష్టించింది. సామాజిక మాధ్య‌మాల్లో ప‌లు రికార్డుల్ని సొంతం చేసుకుంది. విన‌డంలోనేకాదు... చిత్రీక‌ర‌ణ ప‌రంగా కూడా ఈ పాట వెన‌క ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్నాయి. పారిస్‌లోని లిడో డాన్స‌ర్ల నేప‌థ్యంలో షూట్ చేశారట‌. లిడో డ్యాన్స‌ర్ల‌కి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. 25 యేళ్లుగా ఆ ప్ర‌త్యేక‌త‌ని కాపాడుకుంటూ వ‌స్తున్నారు. వాళ్ల‌తో క‌లిసి ఆడిపాడిన ఫస్ట్ సౌత్ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ అని చిత్ర‌వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. పూజా హెగ్డే కూడా ఈ పాట గురించి సోష‌ల్ మీడియాలో గొప్ప‌గా చెప్పుకొచ్చింది. ఈఫిల్ ట‌వ‌ర్‌కి ఏమాత్రం తీసిపోని పాట ఇది అంటూ అక్క‌డే అల్లు అర్జున్‌తో క‌లిసి ఒక ఫోటో తీయించుకొంది. ఆ ఫొటోని సామాజిక మాధ్య‌మాల్లో పంచుకొంది. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌వ‌న‌రి 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.