‘గజేంద్రుడు’ వచ్చేస్తున్నాడు..

ఆర్య కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘కదంబన్‌’. కేథరిన్‌ నాయిక. రాఘవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘గజేంద్రుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఉదయ్‌ హర్ష వడ్డెల్ల నిర్మాత. ఈనెల 21న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ఓ కొండ ప్రాంతంలో నివశించే గిరిజన పుత్రుల నేపథ్యంలో సాగే కథ ఇది. కథనం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా కోసం ఆర్య బరువు పెరగడమే కాదు, కొన్ని సాహసోపేతమైన సన్నివేశాల్లో డూప్‌ లేకుండా నటించారు. యువన్‌ శంకర్‌ రాజా అందించిన సంగీతం అదనపు ఆకర్షణ’’ అన్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.