నా జీవితంలో ఓ మైలురాయి

వరుస సినిమాలతో సెకండ్‌ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోంది దక్షిణాది అగ్రతార జ్యోతిక. ఆమె తాజా చిత్రం ‘పొన్‌మగల్‌ వందల్‌’. ఈ చిత్రాన్ని మే 29న అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందీ చిత్రబృందం. ‘ఇది చిన్న సినిమా. కరోనా మహమ్మారి నేపథ్యంలో దీన్ని థియేటర్లలో విడుదల చేయొద్దని నిర్ణయించుకున్నాం. స్ట్రీమింగ్‌ వేదికల ద్వారా ఈ సినిమా 200 దేశాల్లో విడుదలవుతోంది. ఇది నా జీవితంలో ఓ మైలురాయి’ అని విడుదలకు సంబంధించిన వివరాలు వెళ్లడించిందామె. ఈ చిత్రంలో జ్యోతిక న్యాయవాదిగా కనిపించనుంది. పిల్లలపై జరిగే హింసకు వ్యతిరేకంగా గళమెత్తనుందామె.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.