‘కాంచన 3’ ఎంతో ప్రత్యేకం

రా
ఘవ లారెన్స్‌ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాంచన 3’. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 19న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది. చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నిర్మాత బి.మధు మాట్లాడుతూ ‘‘కాంచన’ చూసిన ప్రతి ప్రేక్షకుడు అభిమానిగా మారిపోయాడు. దానికి కొనసాగింపుగా వచ్చిన ప్రతి సినిమానీ ప్రేక్షకులు ఆదరించారు. ‘కాంచన 3’ లారెన్స్‌ కెరీర్‌లోనే ప్రత్యేకమైనది. ఆయన 220 రోజులు కష్టపడి తెరకెక్కించారు. కథ, కథనం, గ్రాఫిక్స్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తోంది. లారెన్స్‌ గెటప్‌కి కూడా మంచి పేరొచ్చింది. ఆయన మరోసారి ఈ చిత్రంతో అన్నివర్గాల ప్రేక్షకుల్నీ మెప్పిస్తార’’న్నారు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.