జగపతిబాబును ఎదిరించి కీర్తి నిలబడుతుందా?

‘మహానటి’ సావిత్రి పాత్రధారిణి కీర్తి సురేష్‌ నటిస్తున్న సరికొత్త చిత్రం ‘మిస్‌ ఇండియా’. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలై సందడి చేస్తుంది. ట్రైలర్లో జగపతిబాబు డైలాగ్‌ చెబుతూ..‘‘వ్యాపారం అంటే ఆడపిల్లలు ఆడుకునే ఆటలు కాదు. అదొక యుద్ధం అంటూ చెప్పగా... అందుకు ప్రతిగా కీర్తి సురేష్‌..‘‘నేను బిజినెస్‌ చేయడానికే పుట్టాను, దాని కోసం ఏదైనా చేస్తానంటూ..’’జవాబిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ నెట్టింట వైరలౌతోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమౌతోన్న చిత్రానికి మహేశ్ కోనేరు నిర్మాత. చిత్ర కథేంటంటే సంయుక్త (కాజల్‌) తన కుటుంబాన్ని, సాంప్రదాయాలతో పాటు చుట్టూ ఉన్న ప్రపంచంతో పోరాడుతూ తన ప్రయాణాన్ని ఆరంభిస్తుంది. టీ వ్యాపారంలో ఆమె కలలు నెరవేరి సంయుక్త అనుకున్నది సాధించిందా? మిస్‌ ఇండియా కిరీటం దక్కిందా లేదా అన్నది మిగతా కథ. రొమాంటిక్‌ డ్రామా చిత్రంగా వస్తున్న సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. నవంబర్‌ 4, 2020న నెట్‌ఫ్లిక్స్ లో చిత్రం విడుదల కానుంది. నవీన్‌ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నదియా, నరేష్‌, భానుశ్రీ మెహ్రా, పొన్నాడ పూజిత, కమల్‌ కామరాజు తదితర నటీనటులు చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన టీజర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.