ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ‘కెజిఎఫ్‌ 2’

ఈ ఏడాది దక్షిణాది నుంచి రాబోతున్న పెద్ద చిత్రాల్లో ‘కెజిఎఫ్‌ ఛాప్టర్‌ 2’ ఒకటి. ఈ చిత్ర తొలి భాగానికి దేశవ్యాప్తంగా చక్కటి ఆదరణ లభించిన నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న ఈ రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఈ చిత్రంలోని ఓ కీలక ఎపిసోడ్‌ను హైదరాబాద్‌లోని నిజాంల చారిత్రక కట్టడం ఫలక్‌నుమా ప్యాలస్‌లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో పర్యాటక స్థలంగా ఉన్న ఈ ప్యాలస్‌ను ప్రస్తుతం గ్రాండ్‌ హోటల్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడిందులోనే యష్‌ మిగిలిన ముఖ్య చిత్ర బృందంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించబోతున్నారు. ఇందులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను రణ్‌వీణ్‌ ఠండాన్‌ పోషిస్తుండగా.. అధీరా అనే ప్రతినాయక పాత్రలో సంజయ్‌ దత్‌ దర్శనమివ్వబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర గ్రాఫిక్స్‌ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేసి దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.