‘లిసా’ వేసవిలో వినోదాలు పంచుతుంది

అం
జలి ప్రధాన పాత్రలో నటించిన త్రీడీ చిత్రం ‘లీసా’. రాజు విశ్వనాథ్‌ దర్శకుడు. సురేష్‌ కొండేటి నిర్మాత. వీరేష్‌ కాసాని   సమర్పిస్తున్నారు. 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘త్రీడీలో రూపొందిన హారర్‌ చిత్రమిది. వంద రోజులకిపైగా చిత్రీకరణ చేశాం. త్రీడీలో సినిమా తీయడం కష్టమైన పని. అంజలి అభినయం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. బ్రహ్మానందం, సలీమా, మకరంద్‌ దేశ్‌పాండే తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తార’’న్నారు. ‘‘అంజలి నటించిన ‘షాపింగ్‌ మాల్‌’, ‘జర్నీ’ మా ఎస్‌.కె.పిక్చర్స్‌ నుంచే విడుదలయ్యాయి. వాటి తరహాలోనే ఈ చిత్రం మెప్పిస్తుందనే నమ్మకముంది. ‘లీసా’ ఈ వేసవిలో చిన్న పిల్లల నుంచి, పెద్దవాళ్ల వరకు అందరికీ వినోదాలు పంచుతుంది’’ అన్నారు నిర్మాత. ‘‘మొదటిసారి త్రీడీలో నటించా. దర్శకుడు రాజు, ఛాయాగ్రాహకుడు ముత్తయ్య ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డార’’న్నారు అంజలి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.