లోకల్‌ కుర్రాడు వస్తున్నాడు
నుష్‌ కథానాయకుడిగా తమిళంలో తెరకెక్కిన ‘పటాస్‌’ తెలుగులో ‘లోకల్‌ బాయ్‌’గా విడుదలవుతోంది. ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకుడు. మెహరీన్‌ నాయిక. నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ ఈ నెల 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘యుద్ధ విద్యల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ధనుష్‌ ప్రత్యేకంగా తర్ఫీదు పొంది నటించారు. లోకల్‌ కుర్రాడిగా ఆయన చేసే సందడి ఆకట్టుకుంటుంది. మన తెలుగు నటుడు నవీన్‌చంద్ర ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతుంద’’న్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.