`మ‌న్మ‌థుడు 2` విడుద‌ల ఎప్పుడంటే?

నాగార్జున కథానాయ‌కుడిగా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం `మ‌న్మ‌థుడు2`. ర‌కుల్‌ప్రీత్‌సింగ్ క‌థానాయిక‌. స‌మంత‌, కీర్తిసురేష్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. గురువారం టీజ‌ర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర రిలీజ్‌ ముహూర్తాన్ని కూడా ప్రకటించారు. ఆగ‌స్టు 9న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే తుదిద‌శ‌కు చేరుకుంది. దాంతో త్వ‌ర‌లోనే చిత్రం విడుద‌లవుతుంద‌ని ఊహించారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. నాగార్జున నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. సినిమాని మొత్తం చూసుకొని, అంతా ఓకే అనుకొన్నాకే ఆయ‌న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తుంటారు. అవ‌స‌ర‌మ‌నుకుంటే రీ షూట్లు చేయ‌డానికి కూడా ఆయ‌న వెన‌కాడ‌రు. అందుకే నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌కి కావ‌ల్సినంత స‌మ‌యం తీసుకోవాల‌ని భావించిన నాగ్, సినిమాని ఆగ‌స్టు 9న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. `చి.ల‌.సౌ`తో విజ‌యాన్ని అందుకున్న రాహుల్ ర‌వీంద్ర‌న్‌, రెండో ప్ర‌య‌త్నంగా చేసిన చిత్ర‌మిది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.