‘మెలొడీస్‌’ ఆ రోజే

ఆనంద్‌ దేవరకొండ, వర్ష బొల్లమ జంటగా నటించిన చిత్రం ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’. వినోద్‌ అనంతోజు దర్శకుడు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మించారు. వినోదానాత్మకంగా సాగే కథ ఇది. తాజాగా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. నవంబరు 20న అమేజాన్‌ ప్రైమ్‌ ప్లాట్‌ఫామ్‌ పై విడుదల చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు దర్శకనిర్మాతలు. ‘దొరసాని’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు ఆనంద్‌. ఆయన నుంచి రాబోతున్న రెండో చిత్రమిది. మరి ఈ సారి ఎలా ఆకట్టుకుంటాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.