‘మిస్‌ ఇండియా’ విడుదల.. ‘ఉమామహేశ్వర’ టీజర్‌ ఎప్పుడంటే?

మిస్‌ ఇండియా’ చిత్ర విడుదల, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ టీజర్‌ విడుదల తేదీని ప్రకటించాయి చిత్ర బృందాలు. కీర్తి సురేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రమే ‘మిస్‌ ఇండియా’. నరేంద్ర దర్శకుడు. మహిళా ప్రాధాన్య చిత్రంగా రూపొందుంది. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేష్‌ కోనేరు నిర్మిస్తున్న చిత్రం ఏప్రిల్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జగపతిబాబు, నవీన్‌ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, నదియా కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘కంచరపాలెం’ చిత్రంతో వినూత్న స్క్రీన్‌ప్లేను పరిచయం చేసి ఔరా అనిపించుకున్న దర్శకుడు వెంకట్‌ మహా. ఆయన ప్రస్తుతం సత్యతో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అనే మరో విభిన్న కథను తెరకెక్కిస్తున్నారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. మలయాళ చిత్రం ‘మహేషింటే ప్రతీకారమ్‌’ రీమేక్‌ ఇది. ఫిబ్రవరి 21న ఉదయం గం.10లకు సామాజిక మాధ్యమాల వేదికగా టీజర్‌ విడుదల చేయనున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.