డిసెంబరులో ‘మిస్‌మ్యాచ్‌’... పవన్‌ పాటే కీలకమట

ఎన్‌.వి.నిర్మల్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘ఆటగదరా శివ’ ఫేం ఉదయ్‌ శంకర్, ఐశ్వర్య రాజేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. శ్రీ రామరాజు, భరత్‌రామ్‌ నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఇటీవలే ప్రముఖ నటుడు వెంకటేష్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. యాక్షన్‌ అంశాలతో కూడిన ఈ ప్రచార చిత్రం అందరినీ ఆకట్టుకుంది. లక్ష్యం కోసం పోరాడమని చెప్పే డైలాగులు యువతకు స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం ఏంటంటే... పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘తొలిప్రేమ’ చిత్రంలోని సూపర్‌ హిట్‌ గీతం ‘నీ మనసే..’ శ్రోతల్ని ఎంతగా అలరించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ పాటను ‘మిస్‌ మ్యాచ్‌’లో రీమిక్స్‌ చేస్తున్నారు. అంతేకాదు ఈ పాట మొత్తాన్ని సింగిల్‌ షాట్‌లో రూపొందించారట. ‘సినిమా విజయానికి ఈ పాట ఉపయోగపడుతుందని కాదు, పవన్‌ మీద అభిమానంతో ఆయనకు కానుకగా ఇస్తున్నామ’ని చిత్ర బృందం పేర్కొంది. ఈ పాట సినిమాలో కీలకంగా కాబోతుందట. ఎలా అలరించబోతున్నారో తెలియాంటే కొన్ని రోజుల వేచి చూడాల్సిందే. గిఫ్టన్‌ ఎలైస్‌ సంగీత స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకురానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.