‘మిఠాయి’ నవ్వులు పంచుతుంది
రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్‌ కామరాజు, శ్వేతవర్మ, అర్ష ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘మిఠాయి’. ప్రశాంత్‌కుమార్‌ దర్శకుడు. ప్రభాత్‌కుమార్‌ నిర్మాత. రాజేశ్వరి ఫిలింస్‌, మూవీ మ్యాక్స్‌ సంస్థల ద్వారా మామిడాల శ్రీనివాస్‌ ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘డార్క్‌ కామెడీగా విభిన్నమైన పాత్రలతో రూపొందిన చిత్రమిది. రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి పోటీపడి హాస్యాన్ని పంచుతారు. దర్శకుడు మంచి స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. వివేక్‌సాగర్‌ సంగీతం ఆకట్టుకుంటుంది’’ అన్నారు. భూషణ్‌కల్యాణ్‌, రవివర్మ, గాయత్రి గుప్తా తదితరులు నటించారు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.