త్వరలోనే రానున్న ‘నాగకన్య’

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న చిత్రం ‘నాగకన్య’. ఇందులో హీరోగా జర్నీ, రాజా రాణి చిత్రాల నటుడు జై నటిస్తున్నారు. జంబో సినిమాస్ బ్యానర్ పై ఎల్. సురేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి ఏ. శ్రీధర్ నిర్మాత. ఈ సినిమాను వేస‌విలో విడుద‌ల చేసేందుకు చిత్రబృందం స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుద‌లైన ట్రైలర్‌కి మంచి సంప్పందనే వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.... సినిమా మొదటి పోస్టర్లో వరలక్ష్మి శరత్ కుమార్ లుక్‌ని, రెండో పోస్టర్ గా లక్ష్మిరాయ్ లుక్‌ని విడుదల చేశాం వీటికి సినీ అభిమానుల నుంచి మంచి రెస్సాన్స్ వస్తోంది. ఎంతో విభన్నమైన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకుడికి ఉత్కంఠత రేపుతుంది. గ్రాఫిక్స్ అందిరిని ఆకట్టుకుంటాయన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.