మహానాయకుడి ఆగమనం
నందమూరి తారక రామారావు జీవితాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆయన సినీ జీవితం ఆధారంగా రూపొందిన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ సంక్రాంతికి విడుదలైంది. ఆ చిత్రానికి కొనసాగింపుగా, రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్‌ మహానాయకుడిగా ఎదిగిన తీరును ఈ చిత్రంలో కళ్లకు కట్టనున్నారు. ఎన్టీఆర్‌ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ, బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ నటించారు. రానా, కల్యాణ్‌రామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి.

                                         
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.