ఒత్తిడిలోనూ కిక్‌ వెతుక్కుంటా!

రీక్షలకు ముందు విద్యార్థులు ఒత్తిడికి గురైనట్టు సినిమా విడుదల సమయంలో మేమూ టెన్షన్‌ పడతాం. అయితే ఈ ఒత్తిడితోపాటు నాకు ఆత్రుతగా కూడా ఉంటుంది. ఇందులో ఓ కిక్‌ దొరుకుతుంది. అందుకే సినిమా విడుదలకి ముందు రెండు రోజులంటే నాకు చాలా ఇష్టం’’ అని అంటున్నాడు యంగ్‌ హీరో నాని. ఆయన కథానాయకుడుగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. కార్తికేయ, లక్ష్మీ, శరణ్య ముఖ్య పాత్రధారులు. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకుడు. ఈ నెల 13న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. నాని మాట్లాడుతూ.. ‘‘థియేటర్లలో ప్రేక్షకుల నవ్వుల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాం. విక్రమ్‌ వేగంగా తీసిన సినిమా ఇది. నేను గాయపడకపోతే ఇంకా త్వరగా ఈ సినిమా పూర్తయ్యేది. ఈ చిత్రంతో కొత్త కార్తికేయని చూడబోతున్నారు ప్రేక్షకులు. సంగీత దర్శకుడు అనిరుధ్‌ మాకు పెద్ద బలం’’ అని అన్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.