ఈ నెల్లోనే వస్తున్న ‘నవాబ్‌’

మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రం ‘నవాబ్‌’. లైకా ప్రొడక్షన్‌ సమర్పణలో, మద్రాసు పతాకంపై నిర్మితమైన ఈ చిత్రంలో అరవింద్‌ స్వామి, జ్యోతిక, ప్రకాష్‌రాజ్, శింబు, సేతుపతిలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 27న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్, సంతోష్‌ శివన్, సిరివెన్నెల సీతారామశాస్త్రిలాంటి ఉద్దండులు ఈ సినిమాకి పనిచేస్తుండంతో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు చిత్రబృందం. ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందనే వస్తుంది. ముఖ్యంగా మణిరత్నం తీస్తున్న ఈ చిత్రంలో పోరాట, భావోద్వేగాలు అందరిని ఆకట్టుకుంటాయని భావిస్తోంది చిత్రబృందం. ఇంకా చిత్రంలో ఐశ్వర్యరాజేష్,త్యాగరాజన్‌ తదితరులు నటిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.