మూడు కోణాల్లో ‘నేనే కేడీ’

కలక శంకర్‌ కథానాయకుడుగా నటించిన చిత్రం ‘నేనే కేడీ నెం 1’. ముష్కాన్‌ నాయిక. పృథ్వీ కీలక పాత్రధారి. జాని స్వీయదర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 26న విడుదల కానుంది. బుధవారం హైదరాబాద్‌లో నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘మాస్‌లో షకలక శంకర్‌కి ఓ ఇమేజ్‌ ఉంది. ఆ ఇమేజ్‌ని పెంచే చిత్రమిది. కథాబలం ఉన్న చిన్న సినిమాలు ఆదరణ పొందితేనే పరిశ్రమ కళకళలాడుతుంది. చిన్న చిత్రాల శ్రేయస్సు కోసం నిర్మాతల మండలి కృషి చేస్తుంద’’న్నారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘‘పిల్లల పట్ల పెద్దలు బాధ్యత వహించాలనే సందేశం ఇందులో ఉంది. దాన్నే వినోదప్రధానంగా చెప్పాం. శంకర్‌ పాత్ర మూడు కోణాల్లో కనిపిస్తుంద’’న్నారు. ‘నేను నటించిన ‘శంభో శంకర’ చిత్రాన్ని ఆదరించారు. ఈ ‘కేడీ’ కూడా వాళ్లందరికీ నచ్చుతాడ’’న్నారు శంకర్‌.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.