సాహో’లో సల్మాన్‌.. క్లారిటీ ఇచ్చేశారు!

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ‘సాహో’కు సంబంధించి కొద్దిరోజులుగా ఓ వార్త జాతీయ మీడియాలో హల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఓ క్యామియో రోల్‌లో కనిపించబోతున్నాడన్నది దాని సారాంశం. అయితే తాజాగా ఈ విషయం చిత్ర దర్శకుడు సుజీత్‌ క్లారిటీ ఇచ్చారు. ఆయన తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘సాహో’లో ప్రభాస్‌ తప్ప మరే హీరో కనిపించరని తేల్చి చెప్పారు. సల్మాన్‌ ఇందులో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని వస్తున్న వార్తలు అవాస్తవమని.. చిత్రీకరణ పూర్తి కావొస్తున్న దశలో ఇలాంటి ఊహాగాన వార్తలు ఎందుకొస్తున్నాయో అర్థం కావట్లేదని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చురుగ్గా జరుగుతున్నాయని, ఆగస్టు 15న థియేటర్లలోకి రావడం పక్కా అని మరోమారు స్పష్టం చేశారు. ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్‌ నటిస్తుండగా.. నీల్‌ నితీష్, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.