ప్రదీప్‌కి పోటీ లేదు!

పండగ బరిలో దిగాలంటే ఎంతటి సినిమాకైనా పోటీ తప్పదు. వాటన్నింటినీ తట్టుకుని నిలబడినప్పుడే కనక వర్షం కురుస్తుంది. ఆకట్టుకునే పంచులతో ఇన్ని రోజులు బుల్లితెరపైనే సందడి చేశారు యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు. ఆయన ‘ముప్పై రోజుల్లో ప్రేమించటం ఎలా?’ చిత్రంతో వెండితెరపై కథానాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేయనుంది చిత్రబృందం. ఇంచుమించు ఇదే సమయంలో విడుదలకు సిద్ధమయ్యాయి నాని ‘వి’, రాజ్‌ తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చిత్రాలు. కరోనా ప్రభావంతో ఈ రెండూ ఉగాది బరి నుంచి వెనక్కి తగ్గాయి. దీంతో ప్రదీప్‌ చిత్రానికి పోటీ ఉండదని అభిమానులు సంబరపడిపోతున్నారు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.