మహేష్‌ మండే ట్రీట్ ఇదే

టాలీవుడ్‌ అగ్ర నటుడు మహేష్‌బాబు ప్రతి సోమవారం సర్‌ప్రైజ్‌ ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన కథానాయకుడుగా అనిల్‌ రావిపూడి దర్శకవత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న థియేటర్లలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రచారం పర్వం వేగవంతం చేసింది. ఇంతకీ మహేష్‌ అభిమానులకు ఏం ట్రీట్‌ ఇవ్వబోతున్నాడంటే? ప్రతి సోమవారం ఒక పాటను విడుదల చేయనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన గీతాలను వినేందుకు సిద్ధంగా ఉండండి అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నాడు మహేష్‌. ఈ చిత్రంలో మహేష్కు జోడిగా రష్మిక నటిస్తుండగా.. విజయశాంతి, ప్రకాష్‌ రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.