అక్టోబర్‌ 2న తెరపైకి ఒరేయ్‌ బుజ్జిగా

థియేటర్లు తెరుచుకోకపోవడంతో సినిమాలు ఒకొక్కటిగా ఓటీటీ బాట పడుతున్నాయి. రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటించిన ‘ఒరేయ్‌ బుజ్జిగా’ ఆహా ఓటీటీ మాధ్యమంలో విడుదల కాబోతోంది. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించిన చిత్రమిది. రాజ్‌ తరుణ్‌ సరసన మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌ నాయికలుగా నటించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న సినిమాని ఆహాలో విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది. ‘కుమారి 21 ఎఫ్‌’తో ఆకట్టుకున్న రాజ్‌తరుణ్‌ - హెబ్బా మరోసారి ఈ చిత్రంతో సందడి చేస్తారు. ‘భానుమతి అండ్‌ రామకృష్ణ’, ‘జోహార్‌’ లాంటి సినిమాలు ఆహాలో విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ కోవలోనే ఈ చిత్రం అందరినీ అలరిస్తుంద’’ని చిత్రవర్గాలు తెలిపాయి. వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిల్లా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.