లీవ్‌ లెటర్‌ సిద్ధం చేసుకో మామ: రామ్‌

నర్జిటిల్ స్టార్ రామ్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. `డబుల్ దిమాక్`.. ఉపశీర్షిక. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. జులై 12న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు రామ్‌ ప్రకటించారు. ‘‘మామ.. లీవ్‌ లెటర్‌ సిద్ధం చేసుకో’’ అంటూ ‘ఇస్మార్ట్‌’ స్టైల్లోనే ట్వీట్‌లో కామెంట్‌ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, అందులోని సంభాషణలకు సినీ ప్రియుల నుంచి మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.